ETV Bharat / state

'ట్రబుల్ షూటర్‌కే ట్రబుల్​.. హరీశ్​ రాజీనామా చెయ్' - మంత్రి హరీశ్ రావుపై జగ్గారెడ్డి కమెంట్స్

దుబ్బాకలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేకపోవడం తెరాస, భాజపాకు కలిసొచ్చినట్లు అభిప్రాయపడ్డారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. గెలుపు, ఓటములను పక్కన పెడితే తమ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ఐక్యత వచ్చిందన్నారు.

'నియంత పోకడలు... ట్రబుల్ షూటర్‌కే ట్రబుల్ వచ్చింది'

author img

By

Published : Nov 11, 2020, 8:06 PM IST

దుబ్బాక ఉపఎన్నిక ఫలితాలు తమ పార్టీని నిరుత్సాహ పరచలేదని, పోలీసుల అత్యుత్సాహమే భాజపా గెలుపునకు దోహదమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆరోపించారు. ఆటు పోట్లు కాంగ్రెస్ కు కొత్తేమీ కాదన్న ఆయన... దుబ్బాకలో తమ పార్టీకి అభ్యర్థి లేకపోవడం తెరాస, భాజపాకు కలిసొచ్చినట్లు అభిప్రాయపడ్డారు.

గెలుపు, ఓటములను పక్కన పెడితే తమ పార్టీ రాష్ట్ర నాయకత్వంలో ఐక్యత వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి భాజపా, తెరాస, ఎంఐఏం మూడు శత్రువులేనన్న జగ్గారెడ్డి... దుబ్బాక ఉపఎన్నికల్లో గెలిచిన భాజపా సాధారణ ఎన్నికల్లో గెలవలేదని జోస్యం చెప్పారు. తెరాసతో కలసి కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదని స్పష్టం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే నచ్చని వాళ్లే సామాజిక మాధ్యమాల్లో వ్యతిరేక పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు.

తెరాస, హరీశ్ రావు నియంత పోకడలకు ఈ ఓటమి సమాధానం చెప్పిందన్నారు. లక్ష ఓట్ల మెజారిటీ అన్న హరీశ్ రావు... ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ట్రబుల్ షూటర్‌కే... ఇప్పుడు ట్రబుల్ వచ్చిందని, ఓటమికి నైతిక భాధ్యత వహిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చూడండి: దుబ్బాక ఓటమితో తెరాసలో అంతర్మథనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.