ఆర్టీసీ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సంగారెడ్డి డిపో ఎదుట కార్మికులు ఎర్ర బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 95 డిపోల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టామని... ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. డ్రైవర్, కండక్టర్ పోస్టుల భర్తీ, ఉద్యోగ భద్రత, పని ఒత్తిడి వంటి సమస్యలన్నిటిని పరిష్కారించాలని కోరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన కార్మికులను ప్రభుత్వం పట్టించుకోక పోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించిన భయపడేది లేదని.. అలా చేస్తే ఉద్యమం మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి: బావిలో శవాలుగా తేలిన తల్లి, నలుగురు కుమార్తెలు