ఉద్యోగుల హక్కులు.. ఉద్యోగ భద్రతను కాలరాస్తూ మోదీ సర్కారు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకోవడం బాధాకరమని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు అన్నారు. కేంద్రం అవలంభిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఐకాస ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ డిపో ఎదుట ఆందోళనకు దిగారు. భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం సరికాదని ఆర్టీసీ కార్మికులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ: కోదండరాం