ETV Bharat / state

గ్రామీణ విద్యార్థులను ఆదుకొంటున్న రూమ్​ టు రీడ్ సంస్థ​ - what is the plan room to read

Special story on Room to Read organization: చదువుకోవాలన్న ఆశ ఉన్న సరైన వనరులు లేక చాలా మంది విద్యార్థులు చదువుకోలేకపోతున్నారు. అలాంటి వారికి ఎవరో ఒక్కరు సహాయం అందిస్తున్నారు. మరికొంత మందికి సహాయం అందించాలని ఉన్న వారి ఆర్థిక పరిస్థితి వలన ఏమి చేయకుండా ఉండిపోతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల పరిస్థితి ఇలానే ఉంటుంది. అలాంటి నైపుణ్యం ఉన్న విద్యార్థుల కోసం రూమ్ టు రీడ్​ సంస్థ సహాయం అందిస్తోంది.

Special story on Room to Read organization
గ్రామీణ విద్యార్థులను ఆదుకొంటున్న రూమ్​ టు రీడ్ సంస్థ​
author img

By

Published : Jan 22, 2023, 10:49 PM IST

Special story on Room to Read organization: గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల్లో నైపుణ్యం ఉన్నా వారికి తగిన ప్రోత్సాహకం అందించడానికి కొంత మంది వెనుకడుగు వేస్తారు. అలాంటి నైపుణ్యమున్న విద్యార్థులకు తాము ఉన్నామంటూ అండగా నిలుస్తోంది రూమ్ టు రీడ్ సంస్థ. సంగారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలను నెలకొల్పి విద్యార్థుల అభివృద్దికి రూమ్ టు రీడ్ సంస్థ తోడ్పటు అందిస్తోంది. ఈ సంస్థ 15 దేశాల్లో సేవలు కొనసాగిస్తున్నారు. 40,800 గ్రంథాలయాలు నెలకొల్పి పిల్లలు చదువుకునేలా ప్రోత్సాహం అందిస్తోంది.

సంగారెడ్డి జిల్లాలో 2019లో సేవలు ప్రారంభమై ప్రస్తుతం సదాశివ పేట, సంగారెడ్డి, పటాన్చెరు మండలాల్లో కార్యక్రమం నిర్వహిస్తోంది. మూడు మండలాల్లో కలిపి 33 పాఠశాలలని ఎంపిక చేసుకుని నాలుగు లక్షలు ఖర్చు చేసి ఓ గదిలో పుస్తకాలను నెలకొల్పారు. ఆ గది పిల్లలను ఆకర్షించే విధంగా బొమ్మలు, ఇతర సామగ్రిని ఉంచారు. విద్యార్థులతో పాటు వారుితల్లిదండ్రుల్లో విద్యా నైపుణ్యం పెంచాలనే భావనతో వారిని కూడా ప్రోత్సహిస్తున్నారు.

ఈ సంస్థ పుస్తకాలను పిల్లల ఇంటికే ఇస్తుంది. రూమ్ టు రీడ్ సంస్థ భవిష్యత్తులో దశల వారీగా ప్రతి పాఠశాలకు తమ సౌకర్యాలను అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపింది. పిల్లలు రాయడం, చదవడంలో ప్రావీణ్యం పొందటమే సంస్థ ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారం అందిస్తున్నారని నిర్వాహకురాలు కోట గీత తెలిపారు.

"నేను గ్రంథాలయం లీడర్​ని. మా లైబ్రరి టీచర్​ కథలు చెబుతుంది. నాకు చాలా బాగా అర్థమవుతాయి. నాకు చుక్కల కథ అంటే చాలా ఇష్టం.నేను రోజు గ్రంథాలయంకి వచ్చి బొమ్మలు గీస్తాను. ఇక్కడికి వస్తే సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి చదువుకోడం వలన కొత్త విషయాలను నేర్చుకుంటున్నాను. ఇందులో పుస్తకాలు ఒక్కోసారి ఇంటికి తీసుకెళ్తాను. దీని వలన పాఠాలు బాగా అర్థమవుతున్నాయి." - నాల్గో తరగతి విద్యార్థిని

"రూమ్​ టు రీడ్​ చాలా దేశాల్లో ఉంది. మన దేశంలో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంస్థ ముఖ్య ఉద్ధేశం విద్యార్థులు చిన్నతనం నుంచే అంతర్గత సామర్థ్యాలు పెంపొందించుకోవాలి. తమని తాము అభివృద్ధి చేసుకొంటూ సమాజానికి ఉపయోగపడలనేదే సంస్థ లక్ష్యం." -గీత, రూమ్​ టు రీడ్​ గ్రంథాలయ గైడ్​

గ్రామీణ విద్యార్థులను ఆదుకొంటున్న రూమ్​ టు రీడ్ సంస్థ​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.