ETV Bharat / state

కొనసాగుతున్న నిర్మాణం... వర్షంతో అవస్థలు పడుతున్న జనం

వర్షం అవస్థల పాలు చేస్తోంది. ప్రతిసారి ట్రాఫిక్​కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తాలో పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.

బురద రోడ్లకు త్వరగా మరమ్మతులు చేపట్టండి : వాహనదారులు

author img

By

Published : Sep 15, 2020, 12:08 PM IST

సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ చౌరస్తాలో అండర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో భారీగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. వర్షం పడిన సమయంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేశారు.

గుంతలమయం...

గుంతలో నీరు చేరి వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. వర్షం పడితే సంగారెడ్డి చౌరస్తా వరకు వాహనాలు స్తంభించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, గుంతల్లో మట్టి పోసి తగిన చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

ఇవీ చూడండి : నిండుకుండలా శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​.. దిగువకు నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.