సంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. ఓవృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. సదాశివపేట మండలం నందికంది గ్రామం రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది.
రోడ్డు దాటుతుండగా.. అతివేగంగా వచ్చిన లారీ ఢీ కొన్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఇదీ చూడండి: పెట్రోల్ బంక్ వద్ద ఘర్షణ.. సీసీ కెమెరాల్లో రికార్డు