ETV Bharat / state

కూలీల ప్రాణాలను బలిగొన్న అతివేగం - సంగారెడ్డి

సంగారెడ్డి జిల్లా బుదేరా శివారులో బొలెరో వాహనం ఢీకొని ఇద్దరు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు.

కూలీల ప్రాణాలను బలిగొన్న అతివేగం
author img

By

Published : Sep 24, 2019, 11:13 PM IST

వాహన చోదకుని అతివేగం.. కూలీ పనులు చేసుకునే ఇద్దరు యువకుల ప్రాణాల్ని బలి తీసుకుంది. సంగారెడ్డి జిల్లా బుదేరా శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. 65వ నెంబర్ జాతీయ రహదారిపై ఎల్​ అండ్ టీ సంస్థ కార్మికులు రోడ్డు పనులు చేస్తుండగా.. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గినియార్​పల్లి గ్రామానికి చెందిన జగన్, రాములు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకున్న మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు బుదేరా టోల్ ప్లాజా వద్ద నిరసనకు దిగారు. వాహనాలు ఎక్కడిక్కడే నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్​రావు, పోలీసులు, ఎల్ అండ్ టీ సంస్థతో సంప్రదింపులు జరిపి ఒక్కొక్కరికి రూ. 4 లక్షల పరిహారంతో పాటు.. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీతో కుటుంబ సభ్యులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

కూలీల ప్రాణాలను బలిగొన్న అతివేగం

ఇవీచూడండి: భాగ్యనగరంలో భారీవర్షం.. రోడ్లన్నీ జలమయం

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.