సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలోని ఓ డ్రగ్ పరిశ్రమలో ఈరోజు ఉదయం రియాక్టర్ పేలింది. పేలుడు దాటికి పైన ఉన్న రేకులు ధ్వంసమయ్యాయి. ఈ ఘటన జరిగిన సందర్భంలో ఉద్యోగులు అల్పాహారం తీసుకునేందుకు బయటకు వచ్చారు.
ఈ నేపథ్యంలో ఎవరికీ ప్రాణహాని జరగలేదని పరిశ్రమ యాజమాన్యం, పోలీసులు వెల్లడించారు. పెను ప్రమాదం తప్పిందని కార్మికులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీ చూడండి : పన్ను బకాయిలు కట్టేందుకు నేతల క్యూ