సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడీఏ బొల్లారంలోని ఓ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. పీఎన్ఎం లైఫ్‌సైన్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఘటనలో ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అగ్నిప్రమాదం వల్ల పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి: సత్వర పరిష్కారం కోసం ఇక 'టెలిమెడిసిన్'