సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం జ్యోతి నగర్‌కు చెందిన రాధారమణి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గతంలో న్యాయవాదిగా ఉన్న సమయంలో రఘునందన్ రావు తనను మోసం చేశారని మహిళ ఆరోపిస్తోంది. హెచ్ఆర్సీకి వెళ్లానని, పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని అయినా తనకు న్యాయం జరగలేదని వాపోతోంది.
ఆత్మహత్యకు యత్నించిన రాధారమణి నేరుగా రామచంద్రాపురం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లింది. పోలీసులు ఆమెను పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు అన్నిరకాల పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు.
ఇదీ చూడండి: భార్యను హతమార్చి.. ఏమీ ఎరగనట్టు పోలీసులకు ఫిర్యాదు...