సంగారెడ్డి జిల్లా రుద్రారం గీతం విశ్వవిద్యాలయంలో దిశ రెండో వార్షికోత్సవంలో ఆయన పాల్గొని అఖిల భారత సర్వీసులకు సిద్ధం కాబోతున్న వారికి సూచనలు చేశారు. జనరల్ నాలెడ్జ్ అనేది అనంతమని ఎప్పటికప్పుడు నవీకరించుకుంటూ ఈ పరీక్షకు సిద్ధం అవ్వాలని ఆయన తెలిపారు. లక్ష్యం సాధించాలంటే వచ్చే అవరోధాలను దాటుకుని ముందుకు వెళితే విజయం సొంతం అవుతుందని ఆయన తెలిపారు. ఎంతో మంది అఖిల భారత సర్వీసు పరీక్షలు రాస్తున్నప్పటికీ కొంతమందే ఎంపిక అవుతున్నారని తుది ఇంటర్వ్యూకి వచ్చే వారి సంఖ్య కూడా తక్కువగా ఉంటుందని తెలిపారు. మన కళ్ళముందు లక్ష్యం ఒక్కటే కనపడాలని అప్పుడే దాన్ని సాధించగలమనే అని చెప్పారు.
ఇవీ చూడండి: అఘాయిత్యానికి పాల్పడింది ఆ నలుగురే