సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా నిర్ధరణ పరీక్షలు కోసం వచ్చే అనుమానితులు హడలిపోతున్నారు. అక్కడ వరుసలో నిలబడితే తప్పక వైరస్ బారిన పడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొవిడ్ వార్డు పక్కనే పరీక్షలు చేస్తున్నారని కరోనా అనుమానితులు చెబుతున్నారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని వాపోయారు. ఈ సమయంలోనే వైరస్ బాధితులను తీసుకొస్తున్నారని... అలా భయానక పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా బాధితుల పక్కనే నిర్ధరణ పరీక్షలు చేయడం వల్ల పరీక్షల కోసం వచ్చిన అనుమానితులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ పరిస్థితి చూసి చాలామంది పరీక్షలు చేయించుకోకుండా వెళ్లిపోతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి నిర్ధరణ పరీక్షలు వేరేచోట చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇదీ చదవండి: ఆ జంట.. ఫస్ట్ నైట్కు బ్రేకిచ్చిన కరోనా