ETV Bharat / state

జనవాసాల్లోకి కృష్ణ జింక... రక్షించిన పోలీసులు - జహీరాబాద్ లో జింకను రక్షించిన పోలీసులు

గాయపడిన కృష్ణ జింక జనావాసాల్లోకి ప్రవేశించింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లోని ఇళ్ల వద్దకు చేరుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు జింకను సురక్షితంగా పట్టుకుని అటవీశాఖ అధికారులకు అప్పగించారు.

police rescued  deer in jaheerabad
కృష్ణజింకను కాపాడిన పోలీసులు
author img

By

Published : Apr 9, 2021, 9:37 PM IST

అడవులను వదిలి జనంలోకి వచ్చిన కృష్ణజింకను పోలీసులు రక్షించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్​లోని బాబుమోహన్ కాలనీ ఇళ్ల వద్దకు రాగా.. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్ స్థానికుల సాయంతో జింకను కాపాడారు.

అనంతరం పశువైద్యులతో గాయాలకు ప్రథమ చికిత్స అందించి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. జింకను స్వాధీనం చేసుకున్న జహీరాబాద్ అటవీశాఖ క్షేత్ర అధికారి విజయరాణి సిబ్బందితో కలిసి ఫారెస్ట్ అర్బన్ పార్కులో వదిలిపెట్టారు.

ఇదీ చూడండి: జీహెచ్ఎంసీ సిబ్బందికి 100 శాతం వ్యాక్సినేషన్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.