సంగారెడ్డి జిల్లా మెట్పల్లిలో స్థానికులతో పోలీసులు శాంతి సమావేశం నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఈసారి మూడు రోజుల్లోనే ఉత్సవాలు ముగించుకోవాలని జోగిపేట సీఐ శ్రీనివాస్ సూచించారు. గ్రామానికో మూడు అడుగుల లోపు మట్టి విగ్రహం ప్రతిష్టించుకోవాలన్నారు. వేడుకల్లో పెద్ద శబ్ధాలు వచ్చే పరికాలు పెట్టొద్దని తెలిపారు. భక్తులు మాస్క్ ధరించి, భౌతికదూరం పాటిస్తూ... దర్శించుకోవాలని పేర్కొన్నారు. మండపాల వద్ద ఎలాంటి తీర్థప్రసాదాల వితరణ చేయరాదన్నారు. జనసమూహం ఉండేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ధశరథ, గ్రామస్థులు పాల్గొన్నారు.
గణేష్ ఉత్సవాల నిర్వహణపై శాంతి కమిటీ సమావేశం - మెట్పల్లిలో శాంతి కమిటీ సమావేశం
కొవిడ నిబంధనలు పాటిస్తూ... వినాయక ఉత్సవాలు జరుపుకోవాలని సంగారెడ్డి జిల్లా జోగిపేట సీఐ శ్రీనివాస్ సూచించారు. గణేష్ ఉత్సవాల నిర్వహణపై శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు.