సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పారిశ్రామివాడ ఫేజ్5లో పీసీబీ, టీఎఐఐసీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. పేరులేని ఓ గిడ్డంగిలో దాదాపు వంద టన్నుల మెడికల్ వ్యర్థాలు, గడువు ముగిసిన ట్యాబ్లెట్లు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
ఎవరు చేస్తున్నారు?..
చుట్టుపక్కల పరిశ్రమల వాయు కాలుష్యంతో స్థానిక ప్రజలు కొన్నిరోజులుగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. అంతేకాకుండా వాంతులు, కంటి చూపు మందగించడం వంటి సమస్యలకు దారితీయడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. మెడికల్ వ్యర్థాలను ఎవరు తగలబెడుతున్నారో వివరాలు తెలుసుకున్నారు.
అసలు ఇవి ఎక్కడి నుంచి తెస్తున్నారో, వాటిద్వారా అల్యూమినియం ఎలా సేకరిస్తున్నారనేది పూర్తిస్థాయిలో అరా తీశారు. నివేదకను ఉన్నతాధికారులకిచ్చి తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: మూలనపడ్డ ఫ్రిజ్లు... మూణ్నాళ్ల ముచ్చటగా ఫీడ్ ది నీడ్