ETV Bharat / state

పటాన్​చెరు ట్రాఫిక్​ సీఐ కృష్ణపై సస్పెన్షన్​ వేటు - patancheru traffic ci Suspended news

మద్యం మత్తులో వాహనం నడుపుతూ ఓ వ్యక్తిని ఢీకొట్టినందుకు పటాన్​చెరు ట్రాఫిక్​ సీఐపై ఉన్నతాధికారులు వేటు వేశారు. విధుల్లోంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

పటాన్​చెరు ట్రాఫిక్​ సీఐ కృష్ణపై సస్పెన్షన్​ వేటు

author img

By

Published : Jun 13, 2021, 5:24 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ట్రాఫిక్ సీఐ కృష్ణపై ఉన్నతాధికారులు వేటు వేశారు. మద్యం మత్తులో కారుతో ఓ వ్యక్తిని ఢీకొట్టినందుకుగానూ క్రమశిక్షణా చర్యల్లో భాగంగా సీఐని సస్పెండ్ చేస్తూ వెస్ట్​జోన్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఉత్తర్వులు జారీ చేశారు.

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ట్రాఫిక్ పోలీస్​స్టేషన్​లో సీఐగా విధులు నిర్వహిస్తోన్న కృష్ణ ఈ నెల 9న రంగారెడ్డి జిల్లా హయత్​నగర్ పరిధిలో మద్యం మత్తులో ఓ వ్యక్తిని ఢీకొట్టాడు. ప్రమాదానికి గురైన వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో సీఐ కృష్ణపై ఐజీ స్టీఫెన్ రవీంద్ర క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించారు. విధుల్లోంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ఇదీ చూడండి: cheating: విజయవాడలో రియల్ మోసం.. రూ.6 కోట్లకు టోకరా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.