సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి నిర్వహించారు. ఆస్పత్రిలో వైద్యుల సిబ్బంది కొరత ఉందని సూపరింటెండెంట్ వసుంధర తెలిపారు. ఆసుపత్రికి కొత్త రక్తనిధి కేంద్రం మంజూరు అయినా.. ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదన్నారు. డ్రైనేజీ సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని.. సీయామ్ లేకపోవడం వల్ల రోగులు ఇబ్బంది పడాల్సి వస్తుందని ఆమె పేర్కొన్నారు.
ఈ విషయాలపై స్పందించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వైద్య సిబ్బందిని ప్రభుత్వం త్వరలోనే నియమాకాలు చేపట్టనుందన్నారు. డ్రైనేజీ సమస్య తీర్చేందుకు అధికారులను ఆదేశిస్తామన్నారు. అవుట్సోర్సింగ్ సిబ్బందిపై ఫిర్యాదులు అందుతున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి పనికి డబ్బులు ఇచ్చే దాకా వదిలి పెట్టడంలేదని.. అలాంటి వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు. ఏదైనా గొడవ జరిగితే వెంటనే పోలీస్ కేసు పెట్టాలని సూచించారు.
ఇవీ చూడండి: 'దిశ కేసు నిందితులకు మరోసారి శవపరీక్ష'