కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గొల్లపల్లి ప్రజలకు గొల్లపల్లి గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ ఛైర్మన్ శ్రీకాంత్ రెడ్డి కూరగాయలను పంపిణీ చేశారు. ప్రజలు ప్రభుత్వ ఆదేశాలు పాటిస్తున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గ్రామ ప్రజలకు ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా వైరస్ నివారణ పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని ప్రజలకు ఆయన సూచించారు.
ఇదీ చూడండి: సొంతంగా మాస్కు తయారు చేసుకోవటం ఎలా?