ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు, ఒకరు మృతి - MAHILA MRUTHI
సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు ద్విచక్రవాహనాన్ని ఢీకట్టడం వల్ల... ఓ మహిళ మృతి చెందింది.
ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న బస్సు, ఒకరు మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కాసారం గ్రామంలో బంధువులకు చెందిన మహిళ దశదినకర్మకు బయలుదేరారు ఫలక్నుమాకి చెందిన భార్యాభర్తలు. మార్గమధ్యంలో వేగంగా వచ్చిన ప్రైవేటు బస్సు చంద్రమౌళి, స్వరూప వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్య అక్కడిక్కడే మృతి చెందగా... భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. తన కళ్ల ముందే భార్య చనిపోవడం వల్ల చంద్రమౌళి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు.
ఇవీ చూడండి: నేడే మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక
Last Updated : Jun 7, 2019, 9:26 AM IST