ETV Bharat / state

చోరీ చేశాడనే అనుమానంతో గేటుకు కట్టేశారు!

దొంగతనం చేశాడన్న అనుమానంతో 70 సంవత్సరాల వృద్ధుడిని పురపాలక సంఘం అధికారులు తమ కార్యాలయం గేటుకు కట్టేశారు. ఈ అమానవీయ ఘటన సంగారెడ్డి జిల్లా బొల్లారంలో చోటు చేసుకుంది. తప్పు చేస్తే కేసు పెట్టాలి కానీ ఇలా శిక్షించడమేంటని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గేటుకు కట్టేసి ఉన్న జంగయ్య
author img

By

Published : May 25, 2019, 9:08 AM IST

సంగారెడ్డి జిల్లా బొల్లారంలో దారుణం చోటుచేసుకుంది. దొంగతనం చేశాడన్న అనుమానంతో 70 ఏళ్ల వృద్ధుడిని కార్యాలయం గేటుకు కట్టేశారు పురపాలక అధికారులు. స్థానిక చర్చి బస్తీలోని తాగునీటి పైపులైన్​ గేట్​ వాల్వ్​ చోరీ చేశాడన్న అనుమానంతో జంగయ్య అనే వృద్ధున్ని ఇన్​స్పెక్టర్​ వినయ్​ తమ కార్యాలయ ప్రధాన గేటుకు తాళ్లతో కట్టి బంధించాడు.

సంబంధం లేదన్నా వినిపించుకోలేదు...

తనకు చోరీతో ఎటువంటి సంబంధం లేదని వారిస్తున్నా వినకుండా జంగయ్యను అలానే గేటుకు కట్టేశారు. ఈ విషయం పురపాలక కమిషనర్​ దృష్టికి వెళ్లడం వల్ల అతన్ని విడిపించి లోనికి తీసుకొచ్చారు. మరోసారి దొంగతనానికి పాల్పడనని అతనితో హామీ పత్రం రాయించుకుని వదిలేశారు.

గేటుకు కట్టేసి ఉన్న జంగయ్య

అధికారుల తీరుపై విమర్శలు

నేరం చేస్తే కేసు పెట్టకుండా గేటుకు కట్టేసిన సానిటరీ ఇన్​స్పెక్టర్​ వినయ్ ​పైన చర్యలు తీసుకోకుండా జంగయ్యతో హామీ పత్రం రాయించుకున్న కమిషనర్​ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.