పర్యావరణం, భూసారం, భూగర్భ జలాలు పెంపొందించేందుకు డీడీఎస్ మహిళలు చేస్తున్న కృషి అభినందనీయమని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కొనియాడారు. ప్రపంచ స్థాయిలో పర్యావరణ నోబెల్‌గా పిలుచుకునే ఈక్వెడార్ అవార్డును అందుకోవడం అభినందనీయమని అన్నారు.
ఝరాసంగం మండలం మాచనూర్లో నిర్వహించిన పాతపంటల జాతర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో డీడీఎస్ సంఘం కార్యకలాపాలతో ప్రపంచ స్థాయిలో జిల్లాకు గుర్తింపు దక్కుతుందని గుర్తుచేశారు. పర్యావరణ హితంగా జీవవైవిధ్యంతో వ్యవసాయం చేస్తున్న పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు.
పర్యావరణ పరిరక్షణ కోసం రూపొందించిన జహీరాబాద్ అజెండా ప్రతులను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. డీడీఎస్ ఉత్పత్తులను జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తామని కలెక్టర్ తెలిపారు.