ETV Bharat / state

'ఆ నియోజకవర్గంలో ఇప్పటికి ఒక్క కేసు నమోదు కాలేదు' - sangareddy district latest news today

కొవిడ్-19 వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పటాన్​చెరు నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక్క పాజిటివ్​ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. అందుకు చర్యలు తీసుకున్న అధికారులను అభినందించారు.

No single case ever registered in patancheru constituency
'ఆ నియోజకవర్గంలో ఇప్పటికి ఒక్క కేసు నమోదు కాలేదు'
author img

By

Published : Mar 25, 2020, 1:47 AM IST

సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సమావేశమయ్యారు. నియోజకవర్గంలో కరోనా వ్యాధి ప్రబలకుండా తీసుకునే జాగ్రత్తలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. పటాన్​చెరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అందుకు కృషి చేసిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతి మండలంలో అధికారులు, ప్రజాప్రతినిధులు సమావేశాలు జరిపి నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. ఇటలీ, ఇరాన్ వంటి దేశాల్లో ఆ వ్యాధిని పట్టించుకోకపోవడం వల్ల బాధితులు పెరిగిపోతున్నారు అన్నారు. అధికారులు తీసుకునే నిర్ణయాలు ప్రజా శ్రేయస్సు కోసమే అని గ్రహించాలని ప్రజలకు సూచించారు.

'ఆ నియోజకవర్గంలో ఇప్పటికి ఒక్క కేసు నమోదు కాలేదు'

ఇదీ చూడండి : సహకరించండి.. లేకపోతే 24 గంటల కర్ఫ్యూ: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.