ETV Bharat / state

హాజరు వేయించుకుని మాయమవుతున్న ఒప్పంద కార్మికులు - ఒప్పంద కార్మికులు హాజరు వేయించుకుని మాయమవుతున్నారు

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గుత్తేదారులు పనుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నా.. అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దవాఖానాలో విధులకు హాజరైన పారిశుద్ధ్య కార్మికులను కాంట్రాక్టర్లు సొంత పనులకు వినియోగించుకుంటున్నారు. గుత్తేదార్ల నిర్లక్ష్య వైఖరిపై "ఈటీవీ భారత్​" క్షేత్రస్థాయి పరిశీలనాత్మక కథనం.

ఒప్పంద కార్మికులు హాజరు వేయించుకుని మాయమవుతున్నారు
author img

By

Published : Mar 22, 2019, 6:03 AM IST

ఒప్పంద కార్మికులు హాజరు వేయించుకుని మాయమవుతున్నారు
ఆసుపత్రిలో పారిశుద్ధ్య పనులకు వచ్చిన ఒప్పంద కార్మికులు హాజరు వేయించుకుని వెళ్లిపోతున్నారు. గుత్తేదారులు వారిని సొంత పనులకు ఉపయోగించుకుంటున్నారు. ఇలా చేస్తున్నా అధికారులు స్పందించక పోవడం ప్రజలను విస్మయానికి గురిచేస్తోంది.

గురువారం ఉదయం శంకరయ్య, తుజారాం, రాజ్ కుమార్ అనే ముగ్గురు పారిశుద్ధ్య కార్మికులు విధులకు వచ్చారు. ఆసుపత్రిలోనే ఫుడ్ కాంట్రాక్టరుగా ఉన్న జలీల్ వారిని తన సొంత పనుల నిమిత్తం బయటకు తీసుకెళ్లాడు. విషయం తెలుసుకున్న 'ఈటీవీ ఈనాడు" అధికారులతో మాట్లాడగా వారు హాజరు పట్టికను చూపకుండా జాప్యం చేసి చివరికి హాజరు పట్టీలో దిద్దుబాటు చేసి చూపించారు.గుత్తేదారుని సంప్రదించగా కార్మికులు ఈ రోజు విధులకు హాజరు కాలేదని బుకాయించాడు.

ఇప్పటికైనా గుత్తేదారుల తీరుపై దృష్టి సారించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవలసిందిగా ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి:శాసనమండలి ఎన్నికలకు సర్వం సిద్ధం....నేడే పోలింగ్

Intro:HYD_TG_47_21_WIFE_ATTACK_HUSBAND_DEAD_AV_C9

Body:మేడ్చల్: మేడ్చల్ మండలంలోని రాయలపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భార్య భర్తల మధ్య నెలకొన్న చిన్నపాటి గొడవ భర్త మృతి కి కారణమైంది. అల్వాల్ ప్రాంతానికి చెందిన నరేందర్, అనూరాధ దంపతులు కొన్ని సంవత్సరాల క్రితం రాయలపూర్ లో వచ్చి స్థిరపడి పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొన్ని రోజులుగా నరేందర్ మద్యం సేవించి వచ్చి భార్య అనూరాధ ను వేధిస్తున్నాడు హోళీ రోజు కూడా మద్యం తాగి వచ్చి గొడవ పడడంతో విసుగు చెందిన భార్య కల్లు సీసా తో దాడి చేయగా తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Conclusion:విజువల్స్ డెస్క్ వాట్సప్ కు పంపాను.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.