నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి హామీ ఇచ్చారు. వడగండ్ల వర్షంతో మెదక్ జిల్లా పోతులబోగుడ గ్రామంలో నేలరాలిన పంట పొలాలను అయన పరిశీలించారు. వరి, కూరగాయలు, మామిడి రైతులకు అకాల వర్షం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కోతలకు సిద్ధంగా ఉన్న సుమారు రెండు వందల ఎకరాలలో వరిధాన్యం నేలరాలింది. ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.
పంట నష్టంపై పూర్తిస్థాయి నివేదిక తయారు చేసి ఇవ్వాలని తహసీల్దార్ భానుప్రకాష్, మండల వ్యవసాయాధికారి ప్రమీలకు ఆయన సూచించారు.
ఇదీ చూడండి: కరోనా సోకి పోలీస్ ఉన్నతాధికారి మృతి