సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలోని భవాని కాలనీలో విషాదం నెలకొంది. ఎస్బీఐ బ్యాంక్ అటెండర్ మునిస్వామి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. బాత్రూంకి వెళ్లి ప్రమాదవశాత్తు కిందపడి మరణించాడని పోలీసులకు కుటుంబ సభ్యులు సమాచారం ఇచ్చారు.
మృతుడి స్వగ్రామం కర్నూలు జిల్లా అదోని. గత కొన్నేళ్లుగా నారాయణఖేడ్ ఎస్బీఐ శాఖలో అటెండర్‌గా పనిచేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మునిస్వామి మృతిపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
ఇవీచూడండి: కింగ్ కోఠి ఆస్పత్రిలో కరోనా లక్షణాలున్న వ్యక్తి మృతి