ETV Bharat / state

నల్లవాగు నుంచి పంటపొలాలకు సాగు నీరు విడుదల

సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్​లోని నల్లవాగు ఎడమ, కుడి కాలువల గేట్లు ఎత్తి దిగువన ఉన్న పొలాలకు ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. భారీగా కురిసిన వర్షాలకు వాగు పూర్తి సామర్థ్యం చేరుకుని నిండుకుండలా దర్శనిమిస్తోంది.

nallavagu gates opened by mla bhaskar in sangareddy district
నల్లవాగు నుంచి దిగువనున్న పొలాలకు సాగు నీరు విడుదల
author img

By

Published : Jul 29, 2020, 8:16 PM IST

సంగారెడ్డి జిల్లాలోని మధ్యతరహా సాగు నీటి ప్రాజెక్ట్ అయిన సిర్గాపూర్ మండలంలోని నల్లవాగు గేట్లు ఎత్తి ఖరీఫ్ కోసం స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నీరు వదిలారు. ప్రాజెక్టు వద్ద పూజలు చేసిన ఆయన అనంతరం ఎడమ, కుడి కాలువల నుంచి పొలాలకు సాగు నీటిని విడుదల చేశారు.

మంగళవారం కురిసిన భారీ వర్షానికి నల్లవాగు పూర్తి సామర్థ్యం నిండి.. నిండు కుండలా దర్శనమిస్తోంది. ఇప్పటికే అలుగు నుంచి నీరు వృథాగా వాగులో కలుస్తోంది. ప్రాజెక్టు నుంచి దిగువనున్న పొలాలకు సాగునీరు వదలడం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.