ETV Bharat / state

'పరిసరాలు ఆహ్లాదంగా ఉంటే.. మనం సంతోషంగా ఉండొచ్చు'

సంగారెడ్డి జిల్లా పటేల్​గూడలోని ఎల్లంకి ఇంజినీరింగ్​ కళాశాలలో ఎంవీఐ రజామహ్మద్​ మొక్కలు నాటారు. నాటిన ప్రతీ మొక్కను సంరక్షించినప్పుడే పర్యావరణ పరిరక్షణ సాధ్యం అవుతుందని ఆయన పేర్కొన్నారు.

mvi rajamahmad plantation at patelguda in sangareddy
మన పరిసరాలు ఆహ్లాదకరంగా ఉండాలంటే ఈ పని చేయాలి
author img

By

Published : Jul 8, 2020, 8:25 PM IST

పాఠశాలలు, కార్యాలయాలు ఆహ్లాదకరంగా కనిపించాలంటే.. అక్కడ పనిచేసేవారు ఆరోగ్యంగా ఉండాలంటే... అక్కడ విరవిగా మొక్కలు పెంచాలని ఎంవీఐ రజా మహ్మద్‌ తెలిపారు. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ మండలం పటేల్‌గూడ ఎల్లంకి ఇంజినీరింగ్‌ కళాశాలలో రజామహ్మద్‌ వంద మొక్కలు నాటారు.

నాటిన ప్రతిమొక్కనూ రక్షించే విధంగా చర్యలు చేపట్టినప్పుడే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యం నెరవేరుతుందని తెలిపారు. హరితహారంలో భాగంగా వారివారికి ఉపయోగపడే మొక్కలను అన్ని ప్రదేశాల్లో పెంచాలని ఆయన సూచించారు. పర్యావరణ పరిరక్షణ కూడా మొక్కల ద్వారా మెరుగుపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'హరితహారం భావితరాలకు బంగారు బాట అవుతుంది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.