ETV Bharat / state

సీఎం కేసీఆర్​కు ఎల్లవేళలా అండగా ఉంటాం: ఎంపీ ప్రభాకర్ రెడ్డి

author img

By

Published : May 18, 2021, 5:07 PM IST

తెరాస ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం మెడికల్​ కాలేజీని మంజూరు చేసిన సీఎం కేసీఆర్​కు, మంత్రి హరీశ్​రావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

MP kotta Prabhakar Reddy thanked to CM KCR
సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎంపి ప్రభాకర్​రెడ్డి

సంగారెడ్డి జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం మెడికల్​ కాలేజీని మంజూరు చేసిన సీఎం కేసీఆర్​కు, మంత్రి హరీశ్​రావుకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన సమావేశంలో మాట్లాడిన ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి మెడికల్ కాలేజీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రికి ఎల్లవేళలా అండగా ఉంటామని అన్నారు.

హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్న సంగారెడ్డి ప్రాంత ప్రజలను గత పాలకులు పట్టించుకోలేదని ఎంపీ అన్నారు. ఎన్నో ఏళ్లుగా అది చేస్తాం.. ఇది చేస్తాం.. అని మాటలు చెప్పడమే కానీ చేతల్లో చూపించలేదని విమర్శించారు. తెరాస ప్రభుత్వంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధ్యాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యేలు, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఈటలా.. రాజీనామా చెయ్.. తేల్చుకుందాం: గంగుల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.