సంగారెడ్డి జిల్లాకేంద్రంలోని జహీరాబాద్ పట్టణ కేంద్రంలో వెయ్యి మంది ఆటోడ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులకు ఎంపీ బీబీ పాటిల్, ప్రభుత్వ చీఫ్ విప్ గంప గోవర్ధన్‌లు కలిసి నిత్యావసర సరుకులు అందించారు. లాక్డౌన్ కారణంగా ఇంటి వద్దే ఉంటూ ఇబ్బందులు పడుతున్న వారికి సాయం చేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి మీద ఉందన్నారు.
ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలు పణంగా పెట్టి విధులు విర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెల కట్టలేవిని అన్నారు. రాబోయే రోజుల్లో కరోనాతో కలిసి జీవించాల్సి వస్తుందని.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ జాహ్నవి ఇతర నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'