సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రామేశ్వరం బండ కొత్తకాలనీకి చెందిన దుర్గా ప్రసాద్.. రామచంద్రాపురం గ్రేటర్ పరిధిలోని చెత్త సేకరించే పని చేస్తుంటాడు. ఈ నేపథ్యంలోనే 25న ఉదయాన్నే చెత్త సేకరించేందుకు వెళ్లాడు. మధ్యాహ్నం వచ్చి చూసేసరికి తన భార్య, అతని పిల్లలు ప్రభాస్, లావణ్యలు కనిపించలేదు.
విషయం తెలుసుకున్న దుర్గాప్రసాద్... బంధువుల ఇళ్లలో వెతికినా.. ఇప్పటివరకు ఆచూకీ తెలియకపోవడంతో.. బాధితుడు పటాన్చెరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు సోదరుడు అయ్యే రాజు అనే వ్యక్తిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: సీఎం కేసీఆర్ను కలిసిన మహిళా కమిషన్ ఛైర్ పర్సన్