ఆడబిడ్డల పెళ్లిళ్లకు సీఎం కేసీఆర్ మేనమామ కానుకలా... కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద ఆర్థిక సహాయం అందిస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అందజేశారు.
జహీరాబాద్, కోహీర్ మండలాల్లో 23 మంది లబ్ధిదారుల చొప్పున 46 మందికి 50 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో భాగంగా గత ఏప్రిల్ మాసంలో విద్యుదాఘాతంలో పస్తాపూర్‌లో గేదెలు మృతి చెందిన రైతు కుటుంబానికి విద్యుత్ శాఖ అందజేసిన మూడు లక్షల 20 వేల పరిహారం చెక్కును అందజేశారు.
ఇదీ చదవండి: భారీ వర్షం.. రాకపోకలకు తీవ్ర అంతరాయం