సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని రాంనగర్, ఫరీదాకాలనీల్లో ఎమ్మెల్యే మాణిక్రావు, ఎమ్మెల్సీ మహ్మద్ ఫరీదుద్దీన్ పర్యటించారు. జహీరాబాద్-తాండూరు రోడ్లకు ఇరువైపులా వర్షపు నీరు నిల్వ ఉంటోందని కాలనీ వాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నీరు నిల్వ ఉండకుండా కాలువలు తవ్వించాలని విజ్ఞప్తి చేశారు. పురపాలక అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని వారు హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: స్కూల్ బస్సు ఢీకొని ఇద్దరి మృతి