సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో అర్హులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పంపిణీ చేశారు. పటాన్చెరు, అమీన్పూర్ మండలాలకు చెందిన 44 మంది లబ్ధిదారులకు రూ.44,05,104 విలువైన చెక్కులను అందజేశారు.
అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ప్రతి ఒక్కరూ సీఎం కేసీఆర్ను నిండు మనసుతో ఆశీర్వదించాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి : ఎస్‌ఆర్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో నలుగురికి కరోనా నిర్ధరణ