సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని లక్కదొడ్డి, కటికే బస్తీల్లో నాలుగు శాఖల అధికారులతో కలిసి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పాదయాత్ర చేశారు. ఈ రెండు కాలనీల్లో పారిశుద్ధ్యం పరిస్థితి బాగాలేదని... దాన్ని మెరుగు పరచాలని సిబ్బందికి సూచించారు.
కొవిడ్-19 కట్టడిలో భాగంగా మాంసపు వ్యర్థాలను స్థానికంగా నిల్వ చేయకూడదని... ఊరికి దూరంగా పడేయాలని తెలిపారు. అలాగే అక్కడ మాంసపు వ్యర్థాలు నిల్వ ఉంచుతున్న గదిని గ్రేటర్ సిబ్బందితో కూల్చి వేశారు. ఈ కాలనీల్లో రహదారులను వెడల్పు చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఇవీ చూడండి: సీఎంఆర్ఎఫ్కు పెళ్లి ఖర్చులు.. వరుడికి కేటీఆర్ ప్రశంసలు