సంగారెడ్డి జిల్లా కేంద్రంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్శ్రీ రామ్రావు మహారాజ్ విగ్రహ ఏర్పాటుకు స్థలం కేటాయించాలని పాలనాధికారికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి లేఖ రాశారు. సంగారెడ్డి చౌరస్తాలోని ఖాళీ స్థలాన్ని కేటాయించాలని కోరారు. .
లంబాడ తండాల్లో విద్యాభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ తండాల ప్రజలు కోరుతున్నారని తెలిపారు. విగ్రహానికి అయ్యే ఖర్చును తండావాసులే భరిస్తారని వెల్లడించారు.