ఎన్డీఏ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి.. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంగారెడ్డి కొత్త బస్టాండు వద్ద కొన్ని రోజులుగా రైతు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ఈ దీక్షకు మద్దతు తెలుపుతూ .. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి.. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్ని వేళల అండగా ఉంటుందని తెలిపారు. మోదీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: వరంగల్ నగర అభివృద్ధిపై కేటీఆర్ సమీక్ష