రైతులు పండించిన వరి పంటను, అకాల వర్షం కారణంగా తడిచిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ… సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి (MlaJagga reddy) సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. రైతులు ఎవరూ అధైర్య పడవద్దని, నియోజకవర్గం రైతుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడుతుందన్నారు. రైతులకు చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రైతులు ఇన్ని కష్టాలు పడుతుంటే జిల్లా మంత్రులు, ఎంపీలు ఏమయ్యారని మండిపడ్డారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇస్తే రైతులకు నష్టం వాటిల్లకుండా చూసేవారమని అన్నారు. రైతుల ప్రతి కష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని… వారు స్పందించకపోతే వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వానికి అవకాశం ఇస్తే తప్పకుండా ఈ కష్టాలను తొలగిస్తామన్నారు.
వరి ధాన్యంతో పాటు జొన్నలు, మొక్కజొన్న కూడా కేంద్రాల వద్ద తీసుకోవాలని జగ్గారెడ్డి (MlaJagga reddy) డిమాండ్ చేశారు. రైతులు ఎంతో కష్టపడి పంట పండిస్తే అన్ని వారినే భరించుకోవాలని అంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు అధైర్య పడవద్దని ప్రతి వారం ఏదో ఒక సమస్యపై దీక్ష కార్యక్రమాలకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. కరోనా నియంత్రణ జాగ్రత్తలు పాటిస్తూనే మున్ముందు ప్రజల తరపున పోరాడతామని అన్నారు.