సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రిని ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొవిడ్19 చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు. పీపీఈ కిట్ ధరించి.. కరోనా బాధితులతో నేరుగా మాట్లాడారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత లేదని, మెరుగైన వైద్యం అందిస్తారని తెలిపారు.
ఆసుపత్రిలో రెమ్‌డెసివర్ ఇంజక్షన్లతో పాటు.. స్టెరాయిడ్ ఇంజక్షన్లు సైతం అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
- ఇదీ చదవండి అంబులెన్స్‌లో గర్భిణి మృతిపై హైకోర్టు ఆందోళన