సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ కార్యాలయంలో దాత కాశీనాథ్ సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సిబ్బందికి నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లు, సబ్బులు పంపిణీ చేశారు. లాక్‌డౌన్‌కు ప్రజల నుంచి సహకారం లభిస్తోందని ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికీ మాస్కులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని త్వరలో చేపట్టబోతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఆపత్కాలంలో మున్సిపల్ సిబ్బంది అందిస్తున్న సేవలు మరువలేనివని కొనియాడారు.
ఇదీ చూడండి: 'అనుమానాల్లేవ్... కరోనాపై విజయం తథ్యం'