సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ సమీపంలోని 65వ నంబరు జాతీయ రహదారిపై మిషన్ భగీరథ పైప్‌లైన్ గేట్ వాల్వ్ లీక్ అయింది. ఫలితంగా ఉదయం నుంచి నీరు వృథాగా పోతోంది.
నీరు భారీగా ఎగిసిపడుతుండడం వల్ల లారీ డ్రైవర్లు తమ వాహనాలను అక్కడ నిలిపి శుభ్రం చేసుకుంటున్నారు. జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి తాగునీరు దొరకడం కష్టమైన తరుణంలో.. సింగూరు నుంచి వస్తున్న జలాలను ఇలా వృథా చేయడం సరికాదని స్థానికులు మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి.. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి: ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ మార్గదర్శకాలివే...