మైనర్‌పై అత్యాచారం జరిగిన ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూరలో చోటుచేసుకుంది. కడల వీరమణి భర్త నారాయణ కుమారుడు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్న కుమార్తె సాయంత్రం ఏడు గంటల సమయంలో ఇంటి సమీపంలో ఉన్న కిరాణ దుకాణానికి లాలీపాప్ కొనుక్కోవడానికి వెళ్లింది. ఇదే సమయంలో జుబేద్ అనే వ్యక్తి బాలికను ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసినట్లు తల్లిదండ్రుడు తెలిపారు. అనంతరం హత్నూర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు.
ఇవీ చూడండి: అమ్మాయిల పేర్లు చెట్లపై చెక్కిన సైకో