ETV Bharat / state

Minister KTR: కుటుంబాన్ని కోల్పోయిన బాలికకు అండగా నిలిచిన కేటీఆర్

author img

By

Published : Dec 29, 2021, 8:55 AM IST

Updated : Dec 29, 2021, 9:23 AM IST

Minister KTR Tweet About Orphan: విద్యుదాఘాతంతో కుటుంబాన్ని కోల్పోయిన బాలికకు మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. ఆమెను ఆదుకోవాలని సంబంధిత అధికారులకు ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన బాలల పరిరక్షణ కమిటీ అధికారులు బాలిక వద్దకు వెళ్లి.. అండగా ఉంటామని.. చదివిస్తామని హామీ ఇచ్చారు.

Minister KTR Tweet About Orphan
బాలికకు అండగా నిలిచిన కేటీఆర్

Minister KTR Tweet About Orphan: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్‌లో అనాథగా మిగిలిన బాలికకు అండగా నిలిచారు పురపాలక మంత్రి కేటీఆర్. ఇటీవల విద్యుదాఘాతంతో కుటుంబం మృత్యువాతడగా... ఒంటరిగా మిగిలిన బాలిక విద్యాద్రి మల్లికను ఆదుకోవాలని బాలల పరిరక్షణ కమిటీ అధికారులకు మంత్రి చేసిన ట్వీట్‌తో యంత్రాంగం కదిలింది.

బంధువుల సంరక్షణలో ఉన్న బాలిక ఎంత వరకు చదువుకున్నా ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని అధికారులు భరోసా ఇచ్చారు. తండ్రి బసుదేవ్ మల్లిక్ పనిచేస్తున్న పరిశ్రమ నుంచి వచ్చే పరిహారం బాధిత బాలికకు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. తండ్రి వారసత్వ ఆస్తులు ఏమైనా ఉంటే బాలిక పేరు మీదకు బదిలీ చేసేలా ఉత్తర్వులు జారీ చేయిస్తామని తెలిపారు. స్వరాష్ట్రం ఒడిశాకు వెళ్లేందుకు సహకరిస్తామన్న అధికారులు రెండు నెలలకు సరిపడా నిత్యావసరాలు అందించారు.

విద్యుదాఘాతంతో..

Family Died With Current Shock: ఒడిశా రాష్ట్రానికి చెందిన బసుదేవమాలిక్‌ కొంతకాలం క్రితం బతుకుదెరువుకోసం ఇస్నాపూర్​లోని ఓ పరిశ్రమలో పనిచేస్తూ తన కుటుంబంతో కలిసి ప్రముఖ్‌నగర్‌లోని ఓ భవనంలో నివాసముంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం కిటికీపై ఉన్న ఇనుపచువ్వను బసుదేవ మాలిక్‌ తీయబోయాడు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ తీగలకు అతని చేతిలో ఉన్న ఇనుపచువ్వ తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో బసుదేవమాలిక్‌, అతని కాళ్లవద్ద ఉన్న రెండేళ్ల చిన్నకూతురు కున్నుమాలిక్‌ కూడా అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. ఇదే ఘటనలో భార్య రేను మాలిక్‌ తీవ్రంగా గాయపడటంతో ఆమెను చందానగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె కూడా మృతి చెందింది. కుటుంబాన్ని కోల్పోయిన పెద్ద కూతురు అనాథగా మిగిలింది.

ఇదీ చూడండి: two persons died: ఇనుపచువ్వను తీయబోయి.. రెండేళ్ల చిన్నారితో సహా తండ్రి మృతి

Last Updated : Dec 29, 2021, 9:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.