తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ఎస్సీ సంక్షేమ పథకాలు, చట్టాల అమలుపై సంగారెడ్డిలో జరిగిన సమావేశానికి మంత్రి హరీష్ రావు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం అమలు, ఎస్సీల సంక్షేమ కార్యక్రమాల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రం ఏర్పడే నాటికి పది వేల కేసులు కమిషన్లో పెండింగ్లో ఉంటే.. వాటిలో 8000 పరిష్కారించామని మంత్రి తెలిపారు. అట్రాసిటి కేసుల్లో బాధితులకు పరిహారంగా 52కోట్ల 50లక్షల రూపాయలు ఇచ్చామన్నారు. కమిషన్ అడిగిన నివేదికలు పంపిచడంలో ఆలస్యం చేయవద్దని హరీష్ రావు అధికారులకు సూచించారు. సబ్ ప్లాన్ నిధులు సకాలంలో వినియోగించాలన్నారు. ప్రభుత్వ సహకారం వల్లే కమిషన్ ప్రభావవంతంగా పని చేస్తోందని ఎర్రోళ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ప్రతిపక్షాల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి... కేటీఆర్ దిశానిర్దేశం