కాళేశ్వరం నీళ్లు హైదరాబాద్‌కు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లాలో తాలెల్మ ఎత్తిపోతల పథకాన్ని ఆయన ప్రారంభించారు. సింగూరు అంటే హైదరాబాద్‌నీళ్ల కోసం అన్నట్లు ఉండేదన్న హరీశ్‌రావు... తెలంగాణ వచ్చాక సింగూరు జలాలు జిల్లాకే చెందుతున్నాయని తెలిపారు. మల్లన్నసాగర్ జలాలు వస్తే సింగూరులో ఏడాదంతా నీరుంటుందని పేర్కొన్నారు. రూ.36.74 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పథకంతో ఆంధోల్, వట్‌పల్లి, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల్లోని 14 గ్రామాలకు సాగు నీరు అందనుందన్న మంత్రి.. సుమారు 14 వేల ఎకరాలు సస్యశ్యామలం కానున్నాయని వివరించారు.
ఈ సందర్భంగా అగ్నిపథ్ పథకంపైనా మంత్రి మాట్లాడారు. సమాజంలో ఉన్న జవాన్లకు ఉన్న గౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించే ప్రయత్నం చేస్తోందని మంత్రి ఆరోపించారు. అగ్నిపథ్ తెచ్చి యువతను ఆందోళనకు గురి చేస్తోందని విమర్శించారు. మోదీ పాలనలో తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం సంతోషకరం. సింగూరు అంటే హైదరాబాద్ నీళ్ల కోసం అన్నట్లు ఉండేది. తెలంగాణ వచ్చాక సింగూరు జలాలు జిల్లాకే చెందుతున్నాయి. అగ్నిపథ్ ద్వారా కేంద్రం యువతకు అన్యాయం చేస్తోంది. మోదీ ఆర్మీలోనూ క్రాంట్రాక్టు ఉద్యోగాల పద్ధతి తెచ్చారు. జవాన్ల విలువను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది.-మంత్రి హరీశ్‌రావు
ఇవీ చూడండి..