కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గినా.. ప్రజా సంక్షేమ పథకాల కార్యక్రమాలను ప్రభుత్వం ఆపలేదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని ఆందోల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద రూ.2 కోట్లతో నిర్మించే టౌన్హాల్కు మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. అనంతరం 380 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. కరోనా నేపథ్యంలో ఆదాయం తగ్గినా.. ఈ ఒక్క నెలలోనే కల్యాణలక్ష్మి పథకం ద్వారా రూ.401 కోట్ల చెల్లింపులు జరిగాయన్నారు. ఇటీవలే రైతుబంధు పథకం కింద 7400 కోట్లు చెల్లింపులు జరిగాయని తెలిపారు. ఆసరా పింఛన్లను కూడా అందిస్తున్నామన్నారు.
ఆందోల్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న 320 డబుల్ బెడ్ రూమ్‌లను లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి హరీష్‌రావు తెలియజేశారు. అర్హులైన నిరుపేదల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని జిల్లా పాలనాధికారి హనుమంతరావును ఆయన ఆదేశించారు. నిరుపేదల ఎంపిక పారదర్శకంగా జరగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ ఛైర్పర్సన్ మంజుశ్రీ, డీసీసీబీ ఛైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
ఇవీ చూడండి: కరోనా ఐసోలేషన్ సెంటర్ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి