ETV Bharat / state

Harishrao: 'ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలి' - సంగారెడ్డి జిల్లా తాజా వార్తలు

Harishrao:రాష్ట్రంలో ఇస్కాన్ సంస్థ అద్భుతమైన సేవలు అందిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు కొనియాడారు. సంగారెడ్డి జిల్లా కందిలోని అక్షయ పాత్ర ప్రాంగణంలో రాధకృష్ణ ఆలయం నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు.

హరీశ్​రావు
హరీశ్​రావు
author img

By

Published : Jul 31, 2022, 4:06 PM IST

Harishrao: రాష్ట్రంలో ఇస్కాన్ సంస్థ అద్భుతమైన సేవలు అందిస్తోందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు కొనియాడారు. సంగారెడ్డి జిల్లా కందిలోని అక్షయ పాత్ర ప్రాంగణంలో రాధకృష్ణ ఆలయం, హరే కృష్ణ సాంస్కృతిక కేంద్రం నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. అక్షయ పాత్ర ద్వారా నాణ్యమైన భోజనం అందిస్తూ లక్షలాది మంది పేదల ఆకలి తీర్చుతున్నారని పేర్కొన్నారు. ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఎన్ని ఆస్తులు సంపాదించినా.. ఆ భగవంతుని సేవలోనే ఆనందం దొరుకుతుందని చెప్పారు. చట్టాలు, ప్రభుత్వాలు, పోలీసులు చేయించలేని పనిని ఆ భగవంతుని మీద ఉన్న భక్తి చేపిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు.

ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకోవాలి

"ఆకలితో అలమటించే పేదవారికి ప్రతిరోజు 65వేల మందికి భోజనం అందిస్తున్నారు. ఎంతో ఉన్నతమైన ప్రమాణాలతో, సేవాభావంతో నాణ్యమైన భోజనం లక్షల మందికి అందిస్తున్నాం. సంపదను రేపటితరాలవారికి అందించాలనే ఉద్దేశంతో రాధకృష్ణ ఆలయం, హరే కృష్ణ సాంస్కృతిక కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేయడం ఆనందంగా ఉంది. ఎంత ఎత్తుకు ఎదిగినా ఎన్ని ఆస్తులు సంపాదించినా ఆ భగవంతుని సేవలోనే ఆనందం దొరుకుతుంది. ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని ఆలవరుచుకోవాలి." -హరీశ్​రావు ఆర్థిక శాఖ మంత్రి

బాలికల వసతి గృహంను తనిఖీ చేసిన మంత్రి: పటాన్​చెరువు మండలం ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంను మంత్రి హరీశ్​రావు ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, వసతులపై ఆరా తీశారు. మీరందరూ కొవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నారా అని మంత్రి వారిని అడగ్గా.. అందరం తీసుకున్నామని సమాధానం ఇచ్చారు.​ ఇంకా వసతిగృహంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగారు. అందరూ బాగా చదువుకోవాలని హరీశ్​రావు వారికి సూచించారు.

ఇవీ చదవండి: మార్కెట్​లో మరో కొత్త మోసం.. 'ప్రీలాంచ్‌'.. రియల్‌ దందా

కొత్త బిజినెస్​లోకి మహేశ్!​.. మరి ఈ స్టార్స్​ ఏఏ వ్యాపారాల్లో రాణిస్తున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.