ETV Bharat / state

'టీఆర్ఎస్​లో ఉండి కాంగ్రెస్​కి ఓటు వేయించాను' - sangareddy news

మెదక్ ఎమ్మెల్సీ భూపాల్​రెడ్డితో మంచి అనుబంధం ఉండేదని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆయన కాంగ్రెస్​లో ఉండగా... నేను తెరాసలో ఉండి ఆయనకే ఓటు వేయించానని 14 ఏళ్ల క్రితం సంగతిని గుర్తు చేసుకున్నారు.

'ఆయన కాంగ్రెస్​లో ఉన్నా నేను ఆయనకు ఓటు వేయించాను'
minister harish rao and indrakaran reddy open ministers guest house at sangareddy
author img

By

Published : Mar 11, 2021, 6:50 AM IST

సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్ మండలం బీరంగూడ శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయం వద్ద మెదక్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి సొంత నిధులతో నిర్మించిన అతిథి గృహాన్ని మంత్రులు హరీశ్​రావు,ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డితో మంచి అనుబంధం ఉండేదని హరీశ్ రావు తెలిపారు. 14 ఏళ్ల క్రితం భూపాల్ రెడ్డి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పుడు... తాను తెరాసలో ఉండి ఆయనకే ఓటు వేయించానని హరీశ్ రావు తెలిపారు. త్వరలోనే జూనియర్ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. బీరంగూడ దేవాలయానికి చుట్టూ ప్రహరీ నిర్మిస్తే భవిష్యత్తులో ఆలయం, ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

ఇదీ చూడండి: 'ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే కేంద్రం ఎజెండా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.