లాక్‌డౌన్‌తో నెలన్నరపాటు.. పనిలేక, తిండిలేక నానా అవస్థలు పడిన వలస కూలీలు.. కేంద్ర ప్రభుత్వ సడలింపులతో ఎట్టకేలకు ఇళ్లకు చేరుకుంటున్నారు. కానీ పలుచోట్ల ఇంకా కొంతమంది కష్టాలు పడుతూనే ఉన్నారు. రాజస్థాన్‌లోని కరౌలీ జిల్లాకు చెందిన నాలుగు కుటుంబాలు..కోయంబత్తూర్‌లోని ఓ టైల్స్ పరిశ్రమలో పనిచేస్తున్నారు. పరిశ్రమ మూతపడటంతో ... 5గురు పిల్లలు, నలుగురు మహిళలతో కలిపి 18మంది కాలినడకనే స్వస్థలాలకు పయనమయ్యారు. వీరిలో ఇద్దరు నిండు గర్భిణీలున్నారు.
35 రోజుల అనంతరం
మార్గం మధ్యలో లారీ ఎక్కి రాగా.... ఏపీలోని కర్నూలులో అధికారులు అడ్డుకుని వారిని షెల్టర్ హోంకు తరలించారు. అక్కడ 35 రోజులు ఉన్న అనంతరం... మళ్లీ లారీలో రాజస్థాన్‌కు పయణమయ్యారు. ఆ డ్రైవర్ సంగారెడ్డి శివారులో వదిలేసి వెళ్లిపోయాడు. రోడ్డు పక్కనే ఏడుస్తూ కూర్చున్న కూలీలకు ఓ స్వచ్ఛంద సంస్థ ఆహారం అందించింది.
ఇస్నాపూర్‌లోని క్యాంపునకు
స్థానిక అధికారుల జోక్యంతో మొత్తం 18 మందిని ఇస్నాపూర్‌లోని క్యాంపునకు తీసుకెళ్లారు. రైలులో రాజస్థాన్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రామిక్ రైల్లో తిరిగి ఇంటికి పంపిస్తామని చెప్పినా... తమను ఏదైనా వాహనంలో పంపించేయాలని కార్మికులు వేడుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 1000 కిలోమీటర్ల మేర లారీలో ప్రయాణించామని.. ప్రైవేటు వాహనంలోనైనా వెళ్లిపోతామని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇవీ చూడండి: కరోనా పురుషుల్లోనే అధికమట!