సంగారెడ్డి జిల్లా కంది మండలం చర్యల్ గ్రామంలో వైభవంగా మల్లన్న స్వామి కల్యాణం నిర్వహించారు. స్వామి వారికి బోనాలు సమర్పించి పట్టాలు వేశారు. ఆలయం ముందు అగ్ని గుండం ఏర్పాటు చేశారు. ఒగ్గు కళాకారులు కథలు వినిపించారు. గొల్లకుర్మల కుటుంబ సభ్యులతో దేవాస్థానం కిటకిటలాడింది.
జాతరలో సంగారెడ్డి నియోజకవర్గ భాజపా ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు దేశ్పాండే పాల్గొన్నారు. స్వామి వారికి విరాలు అందించారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
ఇదీ చూడండి: యాదాద్రిలో భక్తుల రద్దీ.. దర్శనానికి రెండు గంటలు