సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో సీతారాంకుంట, గోటీలగుట్ట, మాచేపల్లి తండాల్లోని ప్రజలకు మాచేపల్లి ఎంపీటీసీ లక్ష్మీకిషన్ చేయూత అందించారు. సుమారు 300 కుటుంబాలకు నిత్యావసర సరకులు, మాస్కులు, కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా కారణంగా గ్రామాల్లో గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని... అందుకే దాతల సహకారంతో తోచిన సాయం చేస్తున్నామని ఎంపీటీసీ తెలిపారు.
పేదలను ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. కరోనా కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఇదీ చూడండి: కుష్టు వ్యాధి వ్యాక్సిన్‌తో కరోనా చికిత్స!